ర్యాలి

                                                                    ర్యాలి 
ర్యాలి గ్రామం తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెం కు కేవలం 10 కి.మీ లదూరం లో ఉంది.ఈ గ్రామం లో శ్రీ మహావిష్ణువు జగన్మోహినుడు గాను, శివుడు కమందలేశ్వరుడుగా వెలశారు.
శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణార్ధం మరియు ధర్మ ప్రతిస్థాపనార్ధం చాల అవతారాలు ఎత్తి జనులను కాపాడాడు.ఆ కోవలోకే వస్తుంది జగన్మోహిని అవతారం.
ర్యాలి స్థలపురాణం:ఒకసారి దానవులు అమృతాన్ని పొందటం కోసం క్షీరసాగరమధనాన్ని చేశారు.మంధర పర్వతాన్ని కవ్వంగా మార్చి, వాసుకి సర్పాన్ని చిలికెన్దుకు  ఉపయోగించారు.
  


ఆ మంధర పర్వతం అంతకంతకు భూమిలో కూరుకుపోతు ఉండడంతో శ్రీమహావిష్ణువు కూర్మావతరం తో ఆ పర్వతానికి ఆధారంగ నిలిచాడు.అనేక గడ్డు పరిస్తుతులను ఎదుర్కొన్నాక అమృత భాoడo  లభించింది. సహజ స్వార్ధ మనస్కులైన దానవులు అ అమృత భాoడాన్ని దొంగిలించి తీసుకు వెళ్లారు.ఆ దేవతలు శ్రీమహావిష్ణువు కు మొరపెట్టుకొనగా ఆ భక్త రక్షకుడు మోహిని అవతరామెత్తి దానవులకు మొహమాయలో ముంచెత్తాడు.ఆ మయాలోలులై అమృతభాoడo సంగతి మరచిపోయి ఆ మోహిని వెంట పడటం మొదలుపెట్టారు.మోహిని  అవతారం లో ఉన్న ఆ  శ్రీమహావిష్ణువు దేవతలకు చెందవలసిన అమృతాన్ని వారికీ పంచాడు.దీనితో అ దేవతలు అమరులయ్యారు.ఈ విషయం తెలుసుకున్న శివుడు దానవులను మొహమాయలో ముంచెత్తిన ఆ మోహినిని చూడాలనే కుతూహలంతో వేదకుచుండగా శ్రీమహావిష్ణువు మోహిని అవతారం మహాశివుడి ఎదుట నిలబడ్డాడు.ఆఖరికి స్వుడు సైతం అ మోహమయ లో పడి మోహిని దగ్గరకు రాగా ఆమె జడ నుంచి పుష్పం ఒకటి నేలపైపడింది.అ పుష్పం పడిన భూభాగమె ఇప్పుడు ర్యాలి క్షేత్రంగా విరాజిల్లుతున్నది.
ఈ ప్రాంతం ఒక్కప్పుడు పూర్తిగా అరణ్యంగా ఉండేది.ఈ ప్రాంతాన్ని పాలించే విజయేంద్ర వర్మ ఒకసారి వేటకై ఈ ప్రాంతానికి వచ్చాడు.అతడు అలసి ఒకచోట శయనిoచుచుండగా ఆయనకు స్వప్నంలో శ్రీమహావిష్ణువు దర్సనమిచ్చి ఆ ప్రాంతాల్లో తన విగ్రహం ఒకటి భూమిలో ఉన్నదని దానిని వెలికితీసి అక్కడ ఆలయం నిర్మిoచమని అజ్నాపిoచాడు.ఆ రాజు అలాగే ఆలయాన్ని నిర్మించాడు.
ఇక్కడి శ్రీమహావిష్ణువు విగ్రహానికి ఒక విశిష్టత ఉన్నది.అదేమిటంటే విష్ణుమూర్తి ముందరి భాగం పురుష శరీరంలో వెనుక భాగం మోహిని అవతారం ఉంటుంది పైనున్న ఫోటోని గమనిస్తే ఈ విషయం అర్ధమవుతుంది.ఇక్కడి జగన్మోహినుడి విగ్రహం హిందువులకో ఎంతో పవిత్రమైన ఏక సాలగ్రామo తో తయారైంది.కాబట్టి స్థలపురాణం దృష్ట్యా మరియు విగ్రహ ప్రత్యేకత దృష్ట్యా ఇది కచ్చితంగా చూసితీరవలసిన క్షేత్రం.
కాబట్టి మీరు కోనసీమను వీక్షించడానికి వచ్చినపుడు ఈ క్షేత్రాన్ని తప్పక చూడండి.జగన్మోహినుడి అనుగ్రహం పొందండి.

0 comments:

Post a Comment

featured-content

Social Icons

Ads 468x60px

Social Icons

Featured Posts