అలంపురం
ఆలంపూర్ ఆలయ సముదాయం 

అలంపురం మన  లోని అష్టదశ శక్తీ పీటాలలో ఒకటి.ఈ ఆలయాన్ని గురించి  వివరాలు తెలుసుకొనే ముందు మనం అష్టదశ శక్తీ పీటాల గురించి తెలుసుకుందాం.


అష్టదశ శక్తీ పీటాలు:సతీదేవి దక్ష ప్రజాపతికుమార్తె మరియు శివుని భార్య . దక్షప్రజాపతి ఒకసారి ఒక మహాయజ్నం తలపెట్టినాడు.ఆ యజ్ఞానికి త్రిమూర్తులను కూడా ఆహ్వానించ దలచాడు.బ్రహ్మను మరియు విష్ణువును పిలిచిన పిదప అతను కైలసానికి చేరెను.అప్పుడు శివుడు సతిదేవితో ఏకాంతంగా గడుపుతున్న కారణంగా మామగారి రాకను గమనిoచలేదు.దానితో దక్షుడు కోపోద్రిక్తుడై శివుని మరియు  సతీదేవిని పిలువకుండానే అక్కడనుండి నిష్క్రమించాడు.ఈ విషయం తెలిసి తన తండ్రి చేయు యజ్నమునకు తనకు ప్రత్యెక ఆహ్వానము అవసరం లేదని తలచి,  పరమేశ్వరుడు చెప్పిన వినకుండా యజ్నమునకు బయలు జేరింది.
యజ్న ఆవరణము ఎవ్వరు సతీదేవిని పలకరిచలేదు. ఆ సంఘటనకు తీవ్ర మనస్తాపము చెందింది.తన భర్త చెప్పినా వినకుండా వచ్చినందుకు తగిన శాస్తి జరిగినదని తలచి,తన భర్త కు అవమానాన్ని మిగిల్చానని  బాధపడుతూ క్షణికావేసం తో అగ్ని గుండం లో దూకి అగ్నికి ఆహుతి అయ్యింది.
ఈ సంఘటనతో మహాశివుడు ప్రళయకాల రుద్రుడయ్యాడు.అయన వెనువెంటనే యజ్న ప్రాంతమునకు చేరుకోగా అప్పుడు మహాశివుని జటఝుటం నుంచి వీరభద్రుడు ఆవిర్భవించాడు.వారు క్షణాలలో యజ్న ప్రాంతాన్ని ధ్వంసం చేసి వారు దక్ష చేసారు.వారు దక్ష ప్రజాపతి శిరస్సు ఖండించారు.మహా శివుడు కాలుతున్న సతీదేవి ని తీసుకుని ఆకాశ మార్గాన బయలుజేరాడు.ఆ  అగ్ని కి తట్టుకోలేక ముల్లోకాలు కకావికలమయ్యాయి.దేవతలు మహావిష్ణువును ప్రార్ధించగా అతడు శివుని చేతిలో సతీదేవి ఉన్నంత కాలం అతడు మామూలుగా ఉండలేడని తెలిసి  విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండఖండాలుగా  నరకగా అవి భూబగంపై 50 చోట్ల పడ్డాయి.వాటిలో ముఖ్యమైన భాగాలూ పడిన 18 ప్రాంతాలే నేటి మనదేశం లో గల అష్టాదశ శక్తి పీటాలు.వీటిలో ఆలంపూర్ కూడా ఒకటి.ఇక్కడ సతీదేవి దంతాలు పడ్డాయి.
ఈ ఆలంపూర్ మహబూబ్నగర్ జిల్లాలో ఉంది.ఈ ఆలయం హైదరాబాద్ నగరానికి 255 కి.మి.ల దూరంలో ఉంది.ఈ క్షేత్రం కర్నూల్  టౌనుకు కేవలం 32కి.మి. ల దూరంలో ఈ క్షేత్రం ఉంది.కర్నూల్ టౌన్ లో అన్ని రకాల యాత్రికులకు   సరిపడ వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
ఆలంపూర్లో మూడు ముఖ్యమైన ప్రాంతాలు దర్శించవలసి ఉంటుంది.అవి 
1.ఆలయం చుట్టూ ఉన్న 8 శివాలయాలు మరియు జోగులాంబ ఆలయం 
2. తుంగభద్రా నది.ఆ నది స్నానం   మరియు 
3. ఆలయానికి కాస్త దూరంలో ఉన్న సంగామేస్వరాలయం.
శ్రీశైల క్షేత్రం మనదేశంలో గల అత్యంత ప్రాచుర్యం కలిగిన జ్యోతిర్లింగాలలో ఒకటి.ఈ శ్రీశైల క్షేత్రానికి  సింహాద్వారలుగా  నలుగు శైవ క్షేత్రాలు ఉన్నాయి.అవి 
1.   దక్షిణాన సిద్ధవటం 
2.  తూర్పున త్రిపురంతకం
3.  ఉత్తరాన ఉమామహేశ్వరం 
4.   పడమట అలంపురం సింహాద్వారలుగా ఉన్నాయి .
శ్రీశైల క్షేత్రం మనదేశం లోని అతి పురాతనమైన క్షేత్రాలలో ఒకటి.దీనిప్రకారం ఈ ఆలంపుర క్షేత్రం కూడా శ్రిసల క్షేత్రమంత ప్రాచీన క్షేత్రం గా చెప్పవచ్చు.
ఇక్కడి ప్రధాన దైవం బాల బ్రహ్మేశ్వరస్వామి. స్థల పురాణం ప్రకారం ఈ లింగాన్ని బ్రహ్మదేవుడు ప్రతిష్టించినట్టుగా  పురాణలు చెపుతున్నాయి.కొంతకాలానికి రససిద్ధ అనే ఋషికి శివుడు కలలో కనిపించి ఈ ప్రాంతంలో ఆలయం నిర్మించమని అజ్నపించగా అతను ఈ ప్రాంతానికి వచ్చి శివుని గూర్చి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై ఒక రసాన్ని అతనికి ప్రసాదించాడు.దాని ప్రభావం చేత ఆ రసాన్ని ఏ లోహంపై ఉంచిన ఆ లోహం కనకంగా మారసాగింది 
దీనితో అతను ఆలయాన్ని నిర్మించడానికి కావలసిన ద్రవ్యం చేకూరినది.కాని ఈ విషయం ఆ ప్రాంత రాజైన విలసద్ రాజుకు తెలియడంతో అతను ఆ రసాన్ని దొంగిలిచాలనే రాగా, అతని నుంచి తప్పించుకోవటానికి ఆ రుషి శివుని ప్రార్దించాడు.ఆ శివుడు రస సిద్ధుని తనలో ఐక్యం చేసుకున్నాడు.అప్పటికి ఈ ఆలయ నిర్మాణం పూర్తికాలేదు.అ తరువాతి కాలంలో చాలక్యులు ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసారని చరిత్ర చెపుతోంది.అందుకే ఈ అలయనిర్మానం కొంత ఉత్తరాది ఆలయాల మాదిరిగా కొంత దక్షిణాది ఆలయ మాదిరిగా ఉంటుంది    
దక్షిణాది ఆలయ ఆకృతి 
        
                
    

0 comments:

Post a Comment

featured-content

Social Icons

Ads 468x60px

Social Icons

Featured Posts