కాణిపాకం
కాణిపాకం క్షేత్రం చిత్తూరు జిల్లాలో వుంది . చిత్తూరు పట్టణానికి అతి సమీపంలో ఈ క్షేత్రం ఉంది.
తిరుపతి కి 65 కే.మ. దూరంలో ఉంది. తిరుపతి నుంచి సరాసరి కాణిపాకం ఆలయం వరకు బస్సులు అందుబాటులో ఉన్నవి . ఇక్కడ వినాయకుడు ప్రధాన దైవం ఇక్కడ వినాయకుడు స్వయంభు గా వెలిశాడు .
స్థల పురాణం : చోళులు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఒక ముగ్గురు అన్నదమ్ములు "విహార పురం "
అనే గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. వారిలో ఒకరికి గుడ్డి, మరియోకనికి చెవుడు మూడవవానికి మూగ.
వీరికి కొంత సాగు భూమి ఉంది.ఆ భూమిని సాగు చేసుకుందామని ముగ్గురు అన్నదమ్ములు బయలుజేరి పొలమునకు వెళ్లారు.కాని వారి పొలం లోని నూతిలో తగిననత నీరు లేకపోవటం చేత సాగు కు కాస్త ఇబ్బంది ఏర్పడింది.వారు ముగ్గురు ఆ నూతిని తవ్వటానికి బయలుజేరిరి .
కాణిపాక వినాయక స్వామి నిజ రూపం |
ఆ నూతిని తవ్వుతుండగా అకస్మాతుగా నీటితో కూడిన రక్తం పైకి పొంగి ఆ ముగ్గురి యువకుల ఫై పడెను.వెనువెంటనే వారి శారీరక లోపాలు పొయ్యాయి.వారు ఈ విషయాన్ని ఆ గ్రామ ప్రజలకు చెప్పారు.దాంతో ఆ గ్రామ ప్రజలంతా ఆ విగ్రహాన్ని బయటకు తీద్దామని ప్రయత్నించారు.కానీ ఎంత తవ్విన వారికి ఆ విగ్రహం మొదలు దొరకలేదు.దాంతో అ విగ్రహాన్ని అక్కడే వుంచి పూజలు చేయనారంభించారు.అదే ఇప్పటి కాణిపాక క్షేత్రం.ఇక్కడి వినాయకుడికి సాక్షి గణపతిగా పేరుంది.ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రమాణాలు జరుగుతాయి.అంటే ఎదైన వివాదం ఎదురైతే వినాయకుని ముందు నిజాప్రమానం చేయిస్తారు.ఆ దోషి ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినట్టైతే అతను తీవ్ర కష్టాలకు గురవుతారు.తిరుపతి ని లేదా రాయలసీమ ను దర్శించేవారు తప్పక ఈ క్షేత్రాన్ని దర్శించండి.
0 comments:
Post a Comment