మందపల్లి

                                                                    మందపల్లి 
ఆలయ ముఖ ద్వారము 
                                                        


శనిగ్రహ భాధలను గురించి మనకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.శనిగ్రహ పీడితులైన వారి భాదలను తీర్చడానికి శనీశ్వర క్షేత్రాలు కొన్ని మనదేశం లో వెలసాయి.అటువంటి  క్షేత్రాలలో ఒకటై మరియు మన రాష్ట్రంలో గల ఎకైక శనిక్షేత్రంగా  వెలుగొoదుతున్న మందపల్లి క్షేత్రం గురించి దాని ప్రాముఖ్యతను గురించి తెలుసుకుoదాం.



మందపల్లి శనీశ్వరుడు
  ఈ క్షేత్రానికి హైదరాబాద్ నుండి విజయవాడ నుండి వైజాగ్ నుండి మరియు అన్ని ముఖ్య పట్టణాల నుండి యాత్రికులు రావటానికి అన్ని రకాల బస్సు సౌకర్యాలు ఉన్నాయి.రైల్ ద్వారా చేరుకోదలచిన వారు కాకినాడ లేదా రాజమoడ్రిలో దిగి అక్కడ నుండి బస్సు లో చేరుకోవచ్చు.
స్థల పురాణం : ఒకసారి మహాశివుడు మరియు శని సంభాషనలాడుకోనుచుండగా , శివుడు తనకు శని పీడ ఉండబోదని ఎందుకంటె తాను ఈ ప్రపంచానికి లయ కారకుడినని చెప్పాడు. దానికి శని అంగీకరించలేదు.వారిద్దరి మధ్య మాటల యుద్ధం మొదలై అది చివరకు బల పరీక్ష దాక వెళ్ళింది.


ఆలయ ఆవరణం 
మందపల్లి శనీశ్వరుడు 

       
అప్పుడు శివుడు నేను నీకు రేపు ఉదయం వరకు సమయం ఇస్తున్నాను.నీ ప్రభావాన్ని నాపై ప్రసరించు అని అన్నాడు.తరువాతి రోజు ఆ మహాశివుడు శని పీడ నుండి తప్పిoచుకొనటానికి ఒక కీకారణ్యంలో పొదల మధ్యన దాక్కొన్నాడు.తరువాతి రోజు సూర్యోదయం కాగానే అక్కడనుండి బయటకు రాగా శని తానై బల పరీక్ష లో నగ్గినట్టుగా ప్రకటించాడు.శివుడు కోపంతో తనపై శని ప్రభావం అసలు పడలేదని కాబట్టి తనేనగ్గనన్నాడు.అందుకు శని మహాశివ ఈ ప్రపంచానికే లయకారకుడైన శివుడు కేవలం శని పీడను  తప్పిoచుకొనటానికై ఒక అడవిలో గడిపాడు కాబట్టి తానే నగ్గినట్టు ప్రకటించాడు.ఆ మహాశివుడు శని సమయస్పూర్తి కి మిక్కిలి సంతోషించి అతనికి  శివుడు తన ఆత్మలింగాన్ని ఇచ్చాడు.ఆ ఆత్మలింగాన్ని శనిదేవుడు ఎంతో భక్తి తో పుజించానారంభించాడు.ఆ శివలిoగేమె ఈ మందపల్లి శనీశ్వరుడిగా ప్రసిద్ధి కెక్కాడు. 
ఇక్కడి  శనీశ్వరుడికి భక్తులు తమకు శనిభాధలు తొలగి పోవాలని తైలాభిషేకం చేస్తుంటారు. శనిదేవుడికి  ఎంతో ఇష్టమైన నీలి వస్త్రాలతో శివలిoగాన్ని కప్పుతారు.
శని భాధలను అనుభవిస్తున్న వారె కాక అందరు ఈ క్షేత్రాన్ని దరించి తరిoచ ప్రార్ధన.   
ఈ పై ఆర్టికల్ ఫై మీ సలహాలను మరియు అభిప్రాయాలను దయచేసి క్రిందున్న బాక్స్ లో రాసి మాకు దిశా నిర్దేశo  చేయ ప్రార్ధన.
అందమైన ప్రకృతి 
ఆలయ ఆవరణం 








0 comments:

Post a Comment

featured-content

Social Icons

Ads 468x60px

Social Icons

Featured Posts