మహానంది


మహానంది 



మహానంది చాల పురాతన మైన ఆలయం.ఈ ప్రాంత పూర్వ నామం తిమ్మాపురం.ఈ ఆలయం కర్నూల్ జిల్లాలోని నంద్యాలకు 15కి.మీ  ల దూరం లో ఉంది.
               
                                             


స్థల పురాణం: ఒకప్పుడు ఈ ప్రాంతం నంద రాజు అధినం లో ఉండేది.అతని దగ్గర ఆవులు చాల పెద్ద సంఖ్యలో ఉండేవి.వాటిలో 'కపిల' అను పేరు గల ఆవు కూడా ఉండేది.అ ఆవు సాయంసంధ్యమున అన్ని ఆవుల కన్నా కాస్త ఆలస్యo గా ఇంటికి చేరుకోనేది.ఈ   విషయం తెలుసుకున్న రాజు అ ఆవు ను వెంబడిస్తూ వెళ్ళాడు.ఒకచోట అ ఆవు ఆగి అక్కడి మట్టిలో దాగివున్న శివలింగానికి పాలతో అభిషేకిమ్చేది.ఇది చూసిన రాజు ఆశ్చర్యమునకు లోనై, అ శివలింగం గల ప్రాంతంలో ఆలయం నిర్మించినాడు.కపిల అను అవే నందీశ్వరుడ ని రాజు తెలుసుకున్నాడు.
రాజు ను చూసి  పాలిస్తున్నా అ ఆవు ఆ పరుగెత్తడంతో అక్కడి శివలింగం ఫై ఒక చిన్న మచ్చ ఏర్పడింది.ఇప్పటికి భక్తులు అ మచ్చ ను గమనిoచవచ్చు.
             
         
                                            

            ఆలయ ప్రాంగణం
ఈ ఆలయం చలా విశాలంగా నలుగు గాలి గోపురాలతో ఉంటుంది.చరిత్ర కారుల అంచనా ప్రకారం ఈ ఆలయం 7 లేదా 8 వ శతాబ్దం నందు నిర్మించబడింది.విజయనగర మరియు వీర నరసింహ రాజులు ఈ ఆలయానికి విశేష కానుకలను సమర్పించారు.
 ఈ ఆలయానికి కేవలం 15 కి.మి దూరంలో ఇంకా కొన్ని అలయలు ఉన్నాయి.అవి 
                 1.ప్రథమ నంది 
                 2.నాగ నంది 
                 3. సోమ నంది 
                 4. సూర్య నంది 
                 5. విష్ణు నంది 
                 6. శివ నoది 
                 7. వినాయక నంది 
                 8. గరుడ నంది 
                 9. బ్రహ్మ నంది 
పైన చెప్ప బడిన ఆలయాలను ఒకే రోజు దర్శిస్తే భూమండల ప్రదక్షిణ ఫలం లభిస్తుందని ఒక నమ్మకం.
ఇక్కడ చెప్పుకోదగ్గ మరియొక విశేషం గుడి ఆవరణలో గల పుష్కరిణి.ఈ పుష్కరిణి కేవలం 50 అడుగుల వైశాల్యం తో ఉంటుంది.దీనికి నాలుగు వైపులా మెట్లు ఉన్నాయి.ఈ పుష్కరిణి లోనికి నంది నోటిలోనుండి నీరు వస్తు ఉంటుంది.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అ నంది నోట్లోంచి వచ్చే నీరు ఎక్కడ నుండి మొదలవుతుందో ఎవరకి అంతు పట్టని విషయం.కొన్ని శతాబ్దాల క్రిందటే భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో ఈ పుష్కరిణి ద్వారా తెలుస్తుంది.నంది నోటి నుంచే వచ్చే నీరు ఎంత స్వచంగా ఉంటుందంటే గట్టు పైనుంచి నీటి అడుగున ఎక్కడ ఏముందో చెప్పవచ్చు.కాలాలతో సంభందం లేకుండా ఆ నీరు నంది నోటిలో నుండి వస్తూనే ఉంటుంది.
       
పుష్కరిణి లో స్నానం చేస్తున్న భక్తులు 
  

0 comments:

Post a Comment

featured-content

Social Icons

Ads 468x60px

Social Icons

Featured Posts