మంగళగిరి పానకాల స్వామి

                                                                  మంగళగిరి పానకాల స్వామి 
కొండపై ఉన్న పానకాల నరసింహ స్వామి ఆలయ సమూహం


దేవుని ముందు పెట్టిన ప్రసాదాన్ని దేవుడు తింటే అది చూసి పులకించని భక్తులు ఉండరు.కానీ అల ఎక్కడైనా జరుగుతుందా అంటే ఆ ప్రశ్నకు సమాధానము మంగలగిరి శ్రీ పానకాల నరసింహ స్వామి. ఈ విషయాన్ని   వివరంగ తెలుసుకునే ముందు ఇక్కడి స్థల పురాణాన్ని కాస్త తెలుసుకుందాము.
 ఈ క్షేత్రం విజయవాడ మరియు గుంటూరు కు అతి చేరువలో ఉంది.విజయవాడ నుంచి ప్రతి 10 నిమిషాలకు గుంటూరు కు బస్సు సౌకర్యం కలదు. ఆ మార్గ మధ్య లోనే ఈ ఆలయం కలదు.
మన రాష్ట్రము లోని అన్ని ప్రధాన పట్టణాల నుండి బస్సు లేదా రైల్ ప్రయాణం ద్వారా ఈ ఆలయాన్ని సులభంగా చేరుకోవచ్చు.మీకు ఈ ఆలయ సందర్శనార్ధం ఎలాంటి సమాచారాన్నైనా అందిచటానికి మా బ్లాగ్ సిద్ధoగా ఉంది. 
స్థల పురాణం:ఇక్కడ రెండు రకాలైన కథలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి.
వాటిలో మొదటిది 
పూర్వం ఈ ప్రాంతాన్ని పారియాత్ర అను రాజు పాలించేవాడు.అతనికి సంతానము లేకపోవుటచే, సంతానం కొరకు దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను తిరిగగా అతనికి ఒక శిశువు జన్మించాడు.అతనికి హస్తసృంగి అని పేరు పెట్టాడు. కానీ దురదృష్టవసాత్తు అ పిల్లవాడు అoగవికలాంగుడిగా  జన్మించాడు.ఆ  రాజు తన పుత్రుని చూసి చాల విచారపడ్డాడు.తండ్రి బాధ  చూసి హస్తసృంగి బాధాతప్త హృదయంతో అడవులకు వెళ్లి భగవంతుని సాక్షాత్కారం కోసం ఘోరమైన తపస్సు చేసాడు.అంతట  శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవగా హస్తసృంగి తనకు తన జీవితాంతం భగవంతుని పాదాల చెంత  ఉండాలని ఉండాలని చెప్పగా, శ్రీమహావిష్ణువు హస్తసృంగిని ఒక కొండగా మార్చివేసి దానిపై శ్రీమహావిష్ణువు నరసింహ అవతారం లో కొలువయ్యాడు.అదియే ఇప్పటి  పానకాల నరసింహస్వామి ఆ లయం.
మరియొక కథ కూడా ఈ ఆ లయంగూర్చి అందుబాటులోఉంది.మహిషాసుర వధ  జరిగిన తరువాత  దుర్గమ్మ  ఆ గ్రహాగ్నితో రగిలిపోయింది. అప్పుడు ఆమె అగ్ని తన రెండవ కంటి ద్వార ఒక కొండపైకి  వదిలి ఆ కొoడను పెళ్ళగించి గాలిలోకి విసిరివేసింది. అదియె ఇప్పటి నరసింహ స్వామి కొలువైన కొండ.కాని దుర్గమ్మ నుంచి వెలువడిన  ఆ  అగ్నిజ్వాలలు మాత్రం ఆ కొండ నుండి అలాగే వెలువడుతున్నాయి.తరువాతి కాలంలో నరసింహ స్వామి హిరణ్యకసిపున్ని చంపిన  తరువాత  అలాంటి అగ్నిజ్వాలల  తోనే రగిలిపోయాడు.అప్పుడు ప్రహ్లాదుడు ఆయనను స్తుతించగా ప్రసన్నుడై తన  నుంచి వెలువడుతున్న అగ్నిజ్వలను తను అదుపుచేసుకోదలచి అనువైన ప్రాంతాన్ని వెతకుచున్న సమయంలో అప్పటికే అగ్నితో రగులుతున్న ఈ కొండ కనిపించి అక్కడే తనకు అనువైన ప్రాంతo అని తలచి  నరసింహ స్వామి ఇక్కడే  కోలువైయ్యాడు.కొండ కనిపించి అక్కడే తనకు అనువైన ప్రాంతo అని తలచి  నరసింహ స్వామి ఇక్కడే  కోలువైయ్యాడు.కాని అగ్ని జ్వాలలు మాత్రం చల్లారలేదు.
బ్రహ్మదేవుడు ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామిని పానకంతో అభిషేకించగా అగ్నిజ్వాలలు పూర్తిగా ఆరిపోయాయి. అప్పటినుంచి ఇక్కడ పానకంతో  అభిషేకించడం ఆనవాయితీగా మారింది.ఇక్కడ చెప్పుకోతగ్గ విశేషం ఏమిటంటే స్వామి భక్తులు ఇచ్చిన పానకాన్ని అర్చకులు స్వామి నోటిలో పోస్తే నరసింహుడు పానకాన్ని  గుటకలు వేస్తూ సంతోషంగా స్వీకరిస్తాడు.గుటకలు వేసిన శబ్దం కూడా స్ఫష్టంగా వినిపిస్తుంది.స్వామికి భక్తులు ఇచ్చిన పానకాన్ని అర్చకులు స్వామి కి అందివ్వగా స్వామి దానిని త్రాగి మరల కొంత పానకాన్ని బయటకు వదులుతాడు.దానినే భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు.మరియొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ నిరంతరం పానకం నైవేద్యం వళ్ళ అక్కడ పానకం నేలపై పడినా అక్కడ ఒక్క చీమ కూడా ఉండదు మరియు ఒక ఈగ కూడా వాలదు.     భగవంతుడుకి ఇచ్చిన ప్రసాదాన్ని భగవంతుడే తింటే వచ్చే అలౌకిక ఆనందాన్ని భక్తులు సొంతం చేసుకుంటారు. ఇది ప్రతి తెలుగువాడు కచ్చితంగా చూడదగ్గ ప్రాంతం.
                  
 లక్ష్మినారాయణ  స్వామి  బ్రహ్మోత్సవం: 
 స్వామి బ్రహ్మోత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి.ప్రతి ఏట ఇవి ఫాల్గుణ శుద్ధ షష్టి నుంచి మొదలుకొని 11 రోజులు జరుగుతాయి.ఈ మా బ్రహ్మోత్సవాలను ధర్మరాజు ప్రారంభిచాడని ఒక నమ్మకం.శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు తన పుట్టినరోజు వేడుకలని ఇక్కడ జరపమని కోరగా, శ్రీకృష్ణుడు ఆ పనిని ధర్మరాజు కు అప్పగించాడు.అప్పటినుంచి ఇక్కడ నిర్విగ్నంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.
స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు 

క్షీర వృక్షం:
పూర్వం శశిబంది అనే రాజు నారదుని సలహా మేరకు దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలని సందర్శించమని చెప్పగా అతను  తన రాజ్యాన్ని వదలి తీర్థయాత్రలకు వెళ్ళాడు.అయన సతీమణి తనకు స్త్రీల కష్టాలను బాధలను తీర్చి వారికి సంతన భాగ్యం కలగించే వరాన్ని ఇవ్వమని కోరగా, \అప్పుడు నారదుడు అ రాణిని క్షీర వృక్షంగా మార్చాడు.ఆ వృక్షం ఇప్పటికి స్త్రీలకు  దైవంగా మరియు సంతన వృక్షం గా అలరారుతోంది. 
క్షీర వృక్షం 

స్వామి  ఆలయానికి  సంబందిoచిన ఈ క్రింది వీడియో తిలకించండి...




          

0 comments:

Post a Comment

featured-content

Social Icons

Ads 468x60px

Social Icons

Featured Posts