శ్రీ రంగనాథ స్వామి (నెల్లూరు )

                                                        శ్రీ రంగనాథ స్వామి (నెల్లూరు )
మన దేశoలో చాల కొద్ది ఆలయాలలో మాత్రమే శ్రీమహావిష్ణువు ఆదిశేషునిపై పవలిస్తునట్టుగా దర్సన మిస్తాడు.అలాంటి కొద్ది ఆలయాలలో నెల్లూరులోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఒకటి.


 అందుకే కాబోలు ఘంటసాల గారు ఒక గీతంలో
                                                               నెల్లూరి సీమలో చల్లంగా శయనించు శ్రీ రంగనాయక! ఆనందదాయక! అని పాడారు.
రంగనాయక స్వామి ఆలయ సముదాయం మరియు ఆకర్షనీయమైన గాలి గోపురం 
                                     
ఇక ఈ ఆలయం  విషయానికి వస్తే ఇది నెల్లూరు జిల్లాలో పెన్నా నది ఒడ్డున ఉంది.నెల్లూరు పట్టణం మన  రాష్ట్రంలోని  అభివృద్ధి చెందిన పట్టణాలలో ఒకటి.కాబట్టి ఈ ప్రాంతంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను ఈలాంటి అసౌకర్యం కలగకుండా దర్శించవచ్చు.
బస్సు మరియు రైల్ సౌకర్యాలు ఈ ఆలయాన్ని చేరుకోవటానికి పుష్కలంగా ఉన్నాయి.
ఈ ఆలయానికి గాలిగోపురం ఒక ప్రత్యెక ఆకర్షణ.ఇది దాదాపు 80 అడుగుల ఎత్తు ఉంటుంది.
స్థల పురాణం: ఒకసారి శ్రీమహావిష్ణువు ఏకాంతంగా గడపడానికి అనువైన ప్రాంతంలో ఆదిశేషువును ఒక కొండగా మరమని అజ్నాపించగా అతను అలా కొండగా మారి ఇప్పటి రంగనాథుడు కి నివాసయోగ్యంగా మారాడు.ఈ కారణం చేతనే ఈ కొoడను తల్పగిరి  అంటారు.కొంతకాలం స్వామి శ్రీదేవి తో ఏకాంతంగా గడిపాక వైకుంటానికి తిరిగి ప్రయాణమయ్యాడు.స్వామి కొంతకాలం ఇక్కడ ప్రత్యక్షం గ గడిపిన కారణంగా ఇది  ఎంతో పవిత్రమైన ప్రాంతంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయాన్ని పల్లవులు క్రీ.శ 6 7 వ శతాబ్దంలో నిర్మించారని అధరులు ఉన్నాయ్.
ఈ ప్రాంతానికి,ఈ ఆలయానికి చాలామంది రాజులూ వచ్చారని వారు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు మరియు విశేష విరాళాలు ఇచ్చారని ఇక్కడి ధ్వజ స్థంభం పై లిపి ద్వారా తెలుసుకోవచ్చు.
ఆలయం లోపలి అద్బుత కట్టడాలు 


ఇక్కడి ముఖమండపం అప్పటి రాజమహేంద్రవరం  రాజైన రాజరాజనరేంద్రుడు నిర్మించాడు.జాత వర్మ సుందర పాండ్య అనే రాజు ఇక్కడి స్వామి వారికి వీరాభిషేకం నిర్వహించాడు.అంతేగాక ఎన్నో భూములను స్వామి వారికి కానుకగా ఇచ్చాడు.ఎంతో చారిత్రక మరియు పురాణ ప్రాముఖ్యత కలిగిన ఈ ఆలయాన్ని అందరు తప్పకుండ దర్శించాలి.
రంగనాథ స్వామి దర్సించాలంటే మనమంతా ముందు తమిళనాడు లోని ఆలయాల గురించి ఆలోచిస్తాము.ఈ ఆలయాన్ని దర్సించాక తమ ఆలోచనను మార్చుకుంటారని ఆశిస్తున్నాను.    
      .

0 comments:

Post a Comment

featured-content

Social Icons

Ads 468x60px

Social Icons

Featured Posts